VTStyles

Recent Post

Tuesday, 7 June 2016

Breakfast - DoughNut - Boston DoughNut

బోస్టన్‌ క్రీంతో


మైదా - రెండు కప్పులు చక్కెర - ముప్పావుకప్పు గుడ్లు - మూడు ఉప్పు కలపని వెన్న - అరకప్పు తాజా ఈస్ట్‌ - రెండు చెంచాలు పాలపొడి - రెండు చెంచాలు ఉప్పు - అరచెంచా నూనె - వేయించేందుకు సరిపడా గిలకొట్టిన క్రీం - అరకప్పు పేస్ట్రీ క్రీం - కప్పు (బజార్లో దొరుకుతుంది).

  • మైదాను జల్లించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉప్పూ, పాలపొడీ, చక్కెరా, ఈస్ట్‌ వేసి బాగా కలపాలి. తరవాత గుడ్ల సొనా, నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా పిండిలా కలుపుకోవాలి.

  • . ఇప్పుడు కరిగించిన వెన్న వేసి కలిపి, పైన తడి వస్త్రాన్ని కప్పి నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల పిండి పొంగుతుంది. అప్పుడు మరోసారి కలిపి కాస్త మందంగా చపాతీలా వత్తాలి.

  • దీనిపై మధ్యలో రంధ్రం ఉన్న గుండ్రటి మౌల్డుతో నొక్కాలి. ఇలా చేయడం వల్ల గుండ్రంగా గారెల్లా వస్తాయి. తరవాత కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. వీటికి అడ్డంగా చాకుతో చిన్న గాట్లు పెట్టుకోవాలి.

పాలు - లీటరుచక్కెర - అరకప్పు మొక్కజొన్నపిండి - రెండు చెంచాలు గుడ్లు - రెండు వెనిల్లా ఎసెన్స్‌ - అరచెంచా.

  • పాలూ, చక్కెరా పొయ్యిమీద పెట్టాలి. పాలు మరిగాక గుడ్ల పచ్చసొన కలపాలి. తరవాత వెనిల్లా ఎసెన్స్‌ వేయాలి. రెండు టేబుల్‌స్పూన్ల పాలు తీసుకుని అందులో మొక్కజొన్నపిండి కలిపి దీన్ని పాలల్లో వేసి కలపాలి.

  • కాస్త చిక్కగా అయ్యాక దింపేస్తే చాలు. డోనట్లపై ఈ మిశ్రమాన్ని పరవాలి. తరవాత క్రీంను గాటు పెట్టిన అంచుల్లో రాసి.. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు.

No comments:

Post a Comment