VTStyles

Recent Post

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Hariyali Murg

హరియాలీ ముర్గ్‌


చికెన్‌ - అరకేజీ పుదీనా కొత్తిమీర పాలకూర - కప్పు చొప్పున వెల్లుల్లి రెబ్బలు - మూడు పచ్చిమిర్చి - రెండు అల్లం - చిన్న ముక్క నూనె - పావుకప్పు జీలకర్ర - చెంచా లవంగాలు - మూడు ఉల్లిపాయ - ఒకటి ఉప్పు - తగినంత కారం జీలకర్రపొడి - ఒకటిన్నర చెంచా గరంమసాలా - చెంచా పెరుగు - అరకప్పు కసూరీమేథీ - చెంచా.

  • ముందుగా మిక్సీజారులో పుదీనా, కొత్తిమీరా పాలకూర, వెల్లుల్లి రెబ్బలూ, అల్లం, పచ్చిమిర్చి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి.

  • ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె వేడిచేసి జీలకర్రా, లవంగాలూ వేయించాలి. రెండు నిమిషాల తరవాత ఉల్లిపాయముద్ద వేయాలి. దాని పచ్చివాసన పోయాక శుభ్రం చేసిన చికెన్‌ ముక్కలు వేయాలి.

  • ఐదు నిమిషాల తరవాత ముందుగా చేసుకున్న మసాలా, తగినంత ఉప్పూ, జీలకర్రపొడి వేసి మంట తగ్గించేయాలి.

  • చికెన్‌ ఉడికాక గిలకొట్టిన పెరుగూ, గరంమసాలా, కసూరీమేథీ వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.

No comments:

Post a Comment