VTStyles

Recent Post

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Chicken Shakuti

చికెన్‌ షాకూటి


చికెన్‌: కిలో(ముక్కలుగా కట్‌ చేసుకోవాలి) లవంగాలు: ఐదు లేక ఆరు మిరియాలు: పది లేక పన్నెండు ఎండు మిర్చి: పది దాల్చినచెక్క: చిన్నది ధనియాలు: టేబుల్‌ స్పూను యాలకుల పొడి: పావు టీస్పూను నూనె: అరకప్పు మెంతులు: పావు టీస్పూను ఎండుకొబ్బరి: రెండు స్పూన్లు నిమ్మరసం: మూడు టీస్పూన్లు ఉప్పు: రుచికి సరిపడా గసగసాలు రెండు టేబుల్‌ స్పూన్లు నీళ్ళు: తగినన్నిఅల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు ఉల్లిపాయ:ఒకటి(ముక్కలుగా చేసి ముద్దగా చేసుకోవాలి)

  • ముందుగా ఎండుమిర్చిని పావు గంట పాటు నీటిలో నానపెట్టుకోవాలి. ఇప్పుడు లవంగాలు, ధనియాలు, మిరియాలు, దాల్చినచెక్క, కొబ్బరి, గసగసాలు అన్నీ మెత్తగా ముద్దగా రుబ్బుకోవాలి. ఆ తరువాత ఎండు మిర్చిని కూడా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకుని అందులో నూనె వేసి కాగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి.

  • ఆ తరువాత దీనికి ఉప్పు, పసుపు రుబ్బిపెట్టుకున్న మసాలా ముద్ద జత చేసి కొద్దిగా వేయించి తగినన్ని నీరు పోసుకోవాలి. ఇది కొద్దిగా తెర్లుతుండగానే చికెన్‌ ముక్కలు వేసి ఉడికించుకోవాలి

  • చికెన్‌ ముక్కలు ఉడికిన తరువాత సిద్ధం చేసుకున్న ఉల్లిపాయల ముద్ద, ఎండుమిర్చి ముద్ద, యాలకుల పొడి వేసి మరికొద్దిసేపు ఉడికించి దించేయాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి.

No comments:

Post a Comment