నాటు కోడి ముక్కలు - అరకేజీ; పచ్చిమిర్చి - 4 టొమాటోలు - 2(తరగాలి); అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; గరం మసాలా (లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ధనియాలు) - 2 టీ స్పూన్లు; ఉల్లిపాయలు - 2 ఎండుమిర్చి - 2; పసుపు - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూన్; ఎండుకొబ్బరి - 2 టీ స్పూన్లు; నూనె - 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
నాటుకోడి ముక్కలలో కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం- వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కనుంచాలి.
మందపాటి గిన్నె/కుకర్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి, కలపాలి. అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి, వేగాక కలిపి ఉంచిన చికెన్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. టొమాటో వేసి మగ్గనివ్వాలి.
2 కప్పుల నీళ్లు పోసి, ఉప్పు, కారం, ఎండుకొబ్బరి వేసి మరో 15 నిమిషాలు ఉడికించాలి. కుకర్‌లో అయితే 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
దించే ముందు సిద్దం చేసుకున్న గరం మసాలా, కొత్తిమీర వేయాలి. రోటీలు, అన్నంలోకి ఈ కూరను వడ్డించాలి.
No comments:
Post a Comment