రోస్టెడ్ చికెన్ విత్ క్రీం |
సలాడ్ కోసం
ఉల్లిపాయ - ఒకటి లవంగాలు - మూడు వంకాయ - ఒకటి చిన్నది కీరదోస ఎరుపూ పసుపు రంగు క్యాప్సికం - సగం చొప్పున టొమాటో - ఒకటి పుదీనా ఆకులు - మూడు ఆలివ్‌నూనె - రెండు చెంచాలు వెనిగర్ - చెంచా టొమాటో గుజ్జు - పావుకప్పు వాము - కొద్దిగా ఉప్పూ మిరియాలపొడి - రుచికి సరిపడా.
చికెన్ కోసం
మయొనైజ్ - రెండు చెంచాలు క్రీం - మూడు చెంచాలు వెల్లుల్లి ముద్ద - కొద్దిగా ఉల్లికాడల తరుగు - రెండుచెంచాలు కొత్తిమీర తరుగు - చెంచా ఉల్లిపాయ ముద్ద - చెంచా ఉప్పూ మిరియాలపొడి - రుచికి సరిపడా చికెన్ బ్రెస్ట్ - ఒకటి పెద్దది.
సాస్ కోసం:
క్రీం - రెండు చెంచాలు ఉప్పూ మిరియాలపొడి - రుచికి తగినంత కొత్తిమీర తరుగు - కొద్దిగా.
ముందుగా సలాడ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి కూరగాయముక్కలన్నింటినీ వేయాలి. అవి కొద్దిగా మగ్గాక లవంగాలూ, పుదీనాఆకులూ, వెనిగర్, టొమాటోగుజ్జూ, వాము వేసి మూత పెట్టేయాలి. మెత్తగా అయ్యాక తగినంత ఉప్పూ, మిరియాలపొడీ వేసి దింపేసి విడిగా పెట్టుకోవాలి.
చికెన్ కోసం పెట్టుకున్న పదార్థాల్లో చికెన్ తప్ప మిగిలినవన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌కి పట్టించి.. మూడు గంటలు ఉంచేయాలి.
తరవాత 185 డిగ్రీల ఉష్ణోగ్రతలో పదిహేను నిమిషాలు ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి. ఇంతలో సాస్‌కోసం పెట్టుకున్న పదార్థాలను ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద వేడిచేయాలి.
క్రీం కరిగిందనుకున్నాక దింపేయాలి. ఇప్పుడు వెడల్పాటి పళ్లెం తీసుకుని అందులో సలాడ్, చికెన్ సర్దాలి. ఈ చికెన్ పైనుంచి సాస్ వేస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment