VTStyles

Recent Post

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Mutton Kheema Mutter

మటన్‌ ఖీమా మట్టర్‌


మటన్‌ ఖీమా-కేజి పచ్చి బఠాణీలు-ఒక కప్పు నిమ్మరసం-ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌ వంటనూనె-రెండు టేబుల్‌స్పూన్లు ఉల్లిపాయలు(ముక్కలుగా తరిగినవి)-రెండు వెల్లుల్లి రెబ్బలు(చిన్న ముక్కలుగా తరిగినవి)-ఎనిమిది అల్లం ముక్కలు-ఒక టేబుల్‌స్పూన్‌ ఉప్పు-రుచికి సరిపడా కారం-ఒక టీస్పూన్‌ ధనియాల పొడి-ఒక టీస్పూన్‌ జీలకర్ర పొడి-ఒక టీస్పూన్‌ గరం మసాల పొడి-ఒక టీస్పూన్‌ పచ్చిమిర్చి(ముక్కలుగా తరగాలి)-రెండు.

  • అడుగు మందంగా ఉండే ఓ పాత్రను స్టవ్‌పై ఉంచి, అందులో నూనె పోసి, అది వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉప్పు వేసి లేత గోధుమ రంగు వచ్చేంత వరకు వేగించాలి.

  • పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పొడి అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు మటన్‌ ఖీమా వేసి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. తరువాత ముప్పావు కప్పు వేడి నీరు పోసి మంట పెద్దది చేయాలి.

  • ఉడికే స్థాయికి రాగానే పైన మూత పెట్టి మంట తగ్గించి 30 నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత నానబెట్టిన పచ్చి బఠాణీలు వేసి, నిమ్మరసం పిండాలి. కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి దించేయాలి.

No comments:

Post a Comment