హలీమ్ |
ఎముకల్లేని మటన్- కేజీ గోధుమలు - ముప్పావుకప్పు అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు పచ్చిమిర్చి - పది దాల్చినచెక్క - రెండు పెద్ద ముక్కలు యాలకులు - రెండు చెంచాలు పుదీనా కొత్తిమీర - రెండు కట్టలచొప్పున పసుపు - చెంచా కారం - రెండు చెంచాలు ఉప్పు - తగినంత మిరియాలు - పావుకప్పు నిమ్మకాయలు - మూడు కబాబ్ చీనీ - రెండు పెద్ద చెంచాలు (బజార్లో దొరుకుతాయి) నెయ్యి - అరకప్పు ఉల్లిపాయ - ఒకటి పెద్దది వేయించిన జీడిపప్పు - పావుకప్పు పెరుగు - కప్పు వేయించిన ఉల్లిపాయ ముక్కలు- కొన్ని.
గోధుమల్ని రెండు గంటల ముందు నానబెట్టుకుని, నీటిని వంపేసి ఆర బెట్టుకోవాలి. అవి పూర్తిగా ఆరాక మళ్లీ సరిపడా నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
మటన్‌లో మిరియాలూ, పచ్చిమిర్చి, సగం అల్లంవెల్లుల్లి పేస్టూ, దాల్చినచెక్కా, యాలకులూ, సరిపడా నీళ్లూ పోసి పొయ్యిమీద పెట్టాలి. అది మెత్తగా ఉడికాక అందులో గోధుమలు వేసి కలిపి ముద్దలా చేసుకోవాలి.
ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అందులో మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టు వేయించాలి. కొన్ని నిమిషాల తరవాత కారం, పసుపూ, కబాబ్ చీనీ, తగినంత ఉప్పూ, ఉల్లిపాయముక్కలూ, ముప్పావు వంతు పుదీనా, కొత్తిమీర తరుగూ వేసి వేయించుకోవాలి.
అందులో పెరుగు వేసి బాగా కలపాలి. అది మసాలా మాదిరి తయారయ్యాక గోధుమ, మటన్ ముద్దను వేసి పది నుంచి పదిహేను నిమిషాలు పొయ్యిమీద ఉంచాలి.
తరవాత నిమ్మరసం పిండి దింపేయాలి. దీనిసై మిగిలిన పుదీనా ఆకులూ, జీడిపప్పూ, వేయించిన ఉల్లిపాయముక్కలు అలంకరించి తింటే చాలు.
No comments:
Post a Comment