తేగల లడ్డు |
కాల్చిన తేగలు - ఆరు అటుకులు - అరకప్పు ఎండుకొబ్బరిపొడి - అరకప్పు చక్కెరపొడి - కప్పు యాలకులపొడి - చెంచా నెయ్యి - అరకప్పు నుంచీ ముప్పావుకప్పు.
తేగల్ని పీచు తీసుకుని కొబ్బరిలా తురుముకోవాలి. అటుకుల్ని పొడి చేసుకోవాలి.
నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరవాత నెయ్యి వేసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇవి నాలుగైదు రోజులు తాజాగా ఉంటాయి.
No comments:
Post a Comment