VTStyles

Recent Post

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Butter Chicken

బటర్‌ చికెన్‌


ఎముకల్లేని చికెన్‌ - అరకేజీ చిక్కని పెరుగు - పావుకప్పు వెన్న - అరకప్పు వెల్లుల్లి రెబ్బలు - ఆరు అల్లం - పెద్ద ముక్క నూనె - టేబుల్‌స్పూను ఉప్పు - తగినంత గరంమసాలా - చెంచా టొమాటోలు - నాలుగు యాలకులు - ఏడు దాల్చినచెక్క - చిన్నముక్క లవంగాలు - నాలుగు మెంతిపొడి - చెంచా పచ్చిమిర్చి - రెండు జీడిపప్పు - పావుకప్పు (నానబెట్టుకుని ముద్దలా చేసుకోవాలి) కసూరీమేథీ - చెంచా క్రీం - పావుకప్పు.

  • ఓ గిన్నెలో పెరుగూ, నూనె, తగినంత ఉప్పూ, గరంమసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్దలా చేసి, సగం పెరుగులో వేసేయాలి.

  • చికెన్‌ ముక్కలపై ఈ పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి.. ఫ్రిజ్‌లో కనీసం నాలుగుగంటలు పెట్టాలి (అయితే దీన్ని ముందురోజు చేసుకుంటే కూర ఇంకా రుచిగా వస్తుంది).

  • ఇంతలో సాస్‌ తయారు చేసుకోవాలి. టొమాటోలను మిక్సీజారులోకి తీసుకుని గుజ్జులా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెన్నను ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టి.. యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్క వేయాలి.

  • వెన్న కరిగాక మెంతిపొడీ, పచ్చిమిర్చి ముక్కలూ, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసేయాలి. తరవాత టొమాటో గుజ్జు వేసి మంట తగ్గించాలి. కాసేపటికి ఇది కూరలా తయారవుతుంది.

  • ఇందులో జీడిపప్పు ముద్దా, కప్పు నీళ్లూ పోయాలి.. తరవాత చికెన్‌ ముక్కలూ, కసూరీమేథీ, గరంమసాలా వేసి మంట తగ్గించాలి. చికెన్‌ ఉడికిందనుకున్నాక క్రీం, మరికొంచెం ఉప్పూ కలిపి దింపేయాలి.

No comments:

Post a Comment