జామ జెల్లీ |
: దోర మగ్గిన జామపండ్లు - 4 పంచదార - జామ గుజ్జుకి సమాన కొలతగా నిమ్మరసం - 1 టేబుల్ స్పూను బటర్ - 2 టేబుల్ స్పూన్లు ఫుడ్ కలర్ - చిటికెడు.
పై తొక్క తీసిన జామపండ్లను శుభ్రం చేసి తగినంత నీరు పోసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత చిదిమి గింజలు తీసెయ్యాలి.
. జామ గుజ్జుకు సమాన కొలతగా పంచదార కలిపి నిమ్మరసంతో పాటు చిన్నమంటపై ఉడికించాలి. తీగపాకం వచ్చేముందు స్పూను పాలల్లో కరిగించిన (మీకిష్టమైన) ఫుడ్ కలర్‌తో పాటు బటర్ కూడా కలపాలి.
జెల్లీ వేళ్లకు అంటుకుంటుందనగా మంట తీసెయ్యాలి. తర్వాత నూనె రాసిన పళ్లెంలో పోసి సమానంగా పరచాలి.
గోరువెచ్చగా ఉండగానే నూనె రాసిన చాకుతో ముక్కలుగా చేసుకోవాలి. ఇష్టమైతే పంచదార పొడిలో దొర్లించి గాజు సీసాలో భద్రపరచుకోండి. పిల్లలు బాగా ఇష్టపడే జెల్లీ ఇది.
No comments:
Post a Comment