పాలకూర,సెనగ టిక్కీ |
పాలకూర - ఐదు కట్టలు సెనగలు - అరకప్పు పచ్చిమిర్చి - రెండు వెల్లుల్లిరెబ్బలు - ఐదు ఉప్పు - తగినంత గరంమసాలా - రెండు చెంచాలు చాట్‌మసాలా - ఒకటిన్నర చెంచా చీజ్ - అరకప్పు నూనె - ముప్పావుకప్పు బ్రెడ్‌పొడి - కప్పు.
పాలకూరను సన్నగా తరిగి.. కడిగి ఆరబెట్టుకోవాలి. పాలకూరలో తడిపోయాక అదీ పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలూ, మిక్సీ జారులోకి తీసుకుని ముద్దలా చేసుకోవాలి.
తరవాత నానబెట్టిన ఉడికించిన సెనగల్ని అందులో వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ ముద్దను ఓ గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పూ, గరంమసాలా, చాట్‌మసాలా, బ్రెడ్‌పొడి వేసి బాగా కలిపి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.
పదిహేను నిమిషాలయ్యాక కొద్దిగా పాలకూర ముద్దను తీసుకుని చిన్న టిక్కీలా అద్దుకుని అందులో చీజ్‌ని కొద్దిగా ఉంచి.. మళ్లీ టిక్కీలా అద్దుకోవాలి. ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని చేసుకోవాలి.
ఇప్పుడు పెనం పొయ్యిమీద పెట్టి.. రెండు టిక్కీల చొప్పున ఉంచి.. నూనె వేసుకుంటూ రెండువైపులా కాల్చుకుని తీసుకోవాలి.
No comments:
Post a Comment