పనీర్, బఠాణీ టిక్కీ |
బఠాణీలు - అరకప్పు (ఎండుబఠాణీలు అయితే కొన్ని గంటల ముందు నానబెట్టి ఉడికించి ముద్దలా చేసుకోవాలి) పనీర్ తురుము - కప్పు నెయ్యి - ఒకటిన్నర టేబుల్‌స్పూను జీలకర్ర - చెంచా అల్లం తరుగు - రెండు చెంచాలు పచ్చిమిర్చి - రెండు జీలకర్రపొడి కారం - చెంచా చొప్పున ఉప్పు - తగినంత జీడిపప్పు కిస్‌మిస్ పలుకులు - పావుకప్పు కొత్తిమీర - కట్ట (సన్నగా తరగాలి) దాల్చినచెక్కపొడి - అరచెంచా మొక్కజొన్నపిండి - టేబుల్‌స్పూను నూనె - అరకప్పు.
బాణలిని పొయ్యిమీద పెట్టి.. నెయ్యిని కరిగించాలి. అందులో జీలకర్రా, అల్లం తరుగూ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి వేగాక ఉడికించి ముద్దలా చేసుకున్న బఠాణీల మిశ్రమం, జీలకర్రపొడీ, కారం, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి.
రెండు నిమిషాలయ్యాక జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులూ, కొత్తిమీర తరుగూ కలిపి దింపేయాలి. ఇందులో పనీర్ తురుమూ, దాల్చినచెక్కపొడి కూడా వేసి ముద్దలా కలుపుకోవాలి.
ఇప్పుడు మొక్కజొన్నపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పెట్టుకోవాలి. బఠాణీల మిశ్రమాన్ని టిక్కీల్లా అద్దుకోవాలి.
పొయ్యిమీద పెనం వేడిచేయాలి. ఒక టిక్కీని తీసుకుని మైదాపిండిలో ముంచి.. పెనంమీద ఉంచాలి. నూనె వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. ఇలా మిగిలినవీ చేసుకోవాలి.
No comments:
Post a Comment