చేపల పకోడి |
చేపలు - పావుకిలో మొక్కజొన్నపిండి - ఒక కప్పు కారం - రెండు టీ స్పూన్లు పచ్చిమిరపకాయ ముక్కలు - ఒక టేబుల్ స్పూను ఉప్పు - తగినంత నూనె సరిపడా.
చేప ముక్కల్లోంచి ముల్లులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేయాలి. అందులో మొక్కజొన్నపిండి, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఈ పిండిని చిన్న చిన్న పకోడీల్లా వేసి కాల్చుకోవాలి. దీంతో ఎర్రగా వేగిన చేపల పకోడీలు తయారయినట్టే.
No comments:
Post a Comment