సేమియా పకోడి |
సేమియా - ఒక కప్పు శెనగపిండి - ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు అల్లం పేస్ట్ - అర స్పూన్ కరివేపాకు రెబ్బలు - కొన్ని కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు బేకింగ్ పౌడర్ - చిటికెడు కారం - ఒక స్పూన్ ఉప్పు - రుచికి సరిపడా నూనె - వేగించడానికి సరిపడా.
స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక ఒక కప్పు సేమియా వేసి దోరగా వేగించాలి.
ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసి వేడిచేసి అందులో వేగించిన సేమియా వేసి మెత్తగా అయ్యే వరకు మూతపెట్టి ఉడికించాలి.
ఉడికించిన సేమియా, శెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తురుము, బేకింగ్ పౌడర్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా కలపాలి.
తరువాత కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. కలిపి పెట్టుకున్న పిండిని పకోడీల్లా కొద్దికొద్దిగా కాగిన నూనెలో వేసి వేగించాలి.
No comments:
Post a Comment