లెమన్-కొకోనట్ బ్లిస్ బాల్స్ |
ఎండుకొబ్బరి తురుము - రెండున్నర కవులు బాదం గింజలు - అరకవు తేనె - 2-3 టేబుల్ స్పూన్లు కొబ్బరినూనె - 2 టేబుల్ స్పూన్లు తాజా మిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ముందుగా బాదం గింజలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆపైన ఓ బౌల్ తీసుకొని,ఆందులో రెండు కప్పల కొబ్బరి తురము, బాదం గింజలు, తేనె, కొబ్బరి నూనె, నిమ్మరసం వేసి బాగా కలుపకోవాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి ఓ రౌండ్ తిప్పకోవాలి.
తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని గుండ్రంగా చేసుకోవాలి. మొత్తం సుమారు పది లడూలు అయ్యేలా చూసుకోవాలి.
వాటిని మిగిలిన అర కప్ప కొబ్బరి తురుములో దొర్లించాలి. ఇప్పడు వాటిని ఏదైనా ట్రే లాంటి దాంట్లో దూరం దూరంగా పెట్టి డీప్ ఫ్రిజ్లో పెట్టాలి. గంట తర్వాత వాటిని బయటికి తీసి సర్వ్ చేసుకోవచ్చు.
ఈ లెమన్-కొకోనట్ బ్లిస్ బాల్స్ పిల్లలకు ఎంతో ఆరోగ్యకరం కూడా. డైయాబెటిస్తో బాధపడేవారు సైతం వీటిని నిశ్చింతగా లాగించేయొచ్చు.
No comments:
Post a Comment