VTStyles

Recent Post

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Gongura Mutton

గోంగూర మాంసం


మటన్‌ - అరకిలో పసుపు - తగినంత ఉప్పు -తగినంత వెల్లుల్లిరేకలు - పది అల్లం - చిన్న ముక్క పచ్చిమిరపకాయలు - ఆరు కారం - రెండు టీ స్పూన్లు నూనె - మూడు టేబుల్‌ స్పూన్లు లవంగాలు - నాలుగు యాలకులు - నాలుగు బిర్యాని ఆకులు - రెండు ద్రాక్షం చెక్క - ఒకటి(పెద్దది) గోంగూర ఆకు - 200 గ్రాములు ఉల్లిపాయ - ఒకటి(పెద్దది) కరివేపాకు - ఒక రెబ్బ కొత్తిమీర - ఒక కట్ట.

  • మాంసాన్ని కుక్కర్లో వేసి కొద్దిగా అల్లంవెల్లుల్లి ముద్ద, సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మూడు విజిల్స్‌ వచ్చాక దించేసి పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి వెడెక్కాక లంగాలు, యాలకులు, బిర్యాని ఆకులు, ద్రాక్షంచెక్క వేసి వేయించుకోవాలి.

  • తరువాత పచ్చిమిరపకాయలు, అల్లంవెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి.

  • ఉప్పు, కారం, పసుపు, గోంగూర వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉడికించిపెట్టుకున్న మాంసాన్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. దీన్ని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

No comments:

Post a Comment