రాగి స్నాక్స్
రాగి పిండి - ఒకటిన్నర కప్పు బియ్యం పిండి - 1 కప్పు శనగ పిండి - 1 కప్పు మినప పిండి (మినప పప్పును గ్రైండ్ చేసుకోవాలి) జీలకర్ర - 1 టేబుల్ స్పూన్ కారంపొడి - 2 టీ స్పూన్లు ఇంగువ - పావు టీ స్పూన్ ఉప్పు - తగినంత నూనె - సరిపడా
ముందుగా నాలుగు రకాల పిండ్లను పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తర్వాత అవి చల్లారాక ఓ పెద్ద గిన్నెలో వేసి బాగా కలపాలి. అందులో జీలకర్ర, ఉప్పు, కారం, ఇంగువ వేయాలి.
ఇప్పుడు గోరువెచ్చని నీళ్లను పోసుకుంటూ పిండి మిశ్రమాన్ని ముద్దగా చేసుకోవాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకొని.. మురుకులు (జంతికలు) చేసే సాధనంలో పెట్టి ఒత్తుకోవాలి.
ఆపైన స్టౌపై బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. తర్వాత అందులో ఈ మురుకులను కాల్చుకోవాలి. ఒక్క షేప్ అనే కాకుండా వివిధ షేపుల్లో ఈ మురుకులను తయారు చేసుకోవచ్చు.
No comments:
Post a Comment