VTStyles

Recent Post

Thursday, 28 July 2016

Soup - Mixed Veg Soup / వెజిటెబుల్‌ సూప్‌

వెజిటెబుల్‌ సూప్‌


క్యారెట్‌ కాలిఫ్లవర్‌ క్యాబేజీల తురుము - 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున వెల్లుల్లి పేస్టు- 2 టీ స్పూన్లు నూనె- 2 టేబుల్‌ స్పూన్లు కొత్తిమీర తరుగు- 3 టేబుల్‌ స్పూన్లు ఉల్లికాడల తరుగు- 4 టేబుల్‌ స్పూన్లు ఉప్పు- రుచికి తగినంత మిరియాలపొడి- పావు టీ స్పూను నిమ్మరసం- 1 టేబుల్‌ స్పూను మొక్కజొన్న పిండి- 2 టేబుల్‌ స్పూన్లు నీరు- 4 కప్పులు సోయా సాస్‌- 1 టేబుల్‌ స్పూను.

  • నూనెలో వెల్లుల్లి పేస్టు సన్నని మంటపై అర నిమిషం వేగించాలి. తర్వాత క్యారెట్‌, కాలీఫ్లవర్‌, క్యాబేజీ తరుగుని వేసి 40 సెకన్లు వేగించాలి.

  • సగం ఉల్లికాడల తరుగును కూడా వేసి 15 సెకన్లు వేగించి మూడున్నర కప్పుల నీరు, ఉప్పు కలపాలి. అర కప్పు నీటిలో మొక్కజొన్న పిండి కలిపి ఉంచుకొని, కూరగాయల మిశ్రమం మరగడం మొదలవగానే వేసి కలపాలి.

  • 2 నిమిషాల తర్వాత మంట తీసేయాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు, వెనిగర్‌ కలిపి బౌల్స్‌లో వేసుకుని పైన మిరియాలపొడి, (మిగిలిన) ఉల్లికాడల తరుగు, సోయాసాస్‌ (డ్రాప్స్‌గా) చల్లి వేడివేడిగా తాగాలి.

No comments:

Post a Comment