VTStyles

Recent Post

Thursday, 28 July 2016

Soup - Springonion Milk Soup / ఉల్లికాడలు, పాలు సూప్‌

ఉల్లికాడలు, పాలు సూప్‌


ఉల్లి కాడలు - 2 కట్టలు ఉల్లి తరుగు - పావు కప్పు తరిగిన వెల్లుల్లి - 2 రేకలు ఆలివ్‌ నూనె - 2 టీ స్పూన్లు చిక్కటి పాలు - అరకప్పు నీళ్లు / వెజిటెబుల్‌ స్టాక్‌ - 1 కప్పు ఉప్పు - రుచికి తగినంత మెదిపిన మిరియాలు - 1 టీ స్పూను.

  • ఉల్లికాడల్ని శుభ్రం చేసి కింద భాగాన్ని, పై భాగాన్ని విడి విడిగా కట్‌ చేయాలి. ఆలివ్‌ నూనెలో వెల్లుల్లి, ఉల్లి, కాడల (కింద భాగం) తరుగు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి.

  • ఇప్పుడు కాడల (పైభాగం) తరుగు వేసి రంగు మారకుండా వేగించి దించేయాలి.

  • చల్లారిన తర్వాత పేస్టులా చేసుకుని పాలు, నీరు/ వెజిటబుల్‌ స్టాక్‌లతో కలిపి 7 నిమిషాలు మరిగించాలి. ఉప్పు, మిరియాలపొడి కలిపి నేతిలో వేగించిన బ్రెడ్‌ ముక్కలతో అలంకరించుకుని తాగాలి.

No comments:

Post a Comment