కార్న్ ఫ్రిట్టర్స్
కార్న్ - 150 గ్రా ఉల్లిముక్కలు - అర కప్పు వెల్లుల్లి రెబ్బలు - 2 పచ్చిమిర్చి - 2 బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్ శెనగపిండి - 1 టే.స్పూన్ మైదా - 1 టే.స్పూన్ జీలకర్ర పొడి - అర టీస్పూన్ కార్న్ ఫ్లోర్ - 1 టే.స్పూన్ నూనె - 1 టే.స్పూన్ పాలు - 2 టే.స్పూన్లు కొత్తిమీర ఉప్పు - తగినంత కారం - 1 టీస్పూన్.
బాండీలో నూనె పోసి ఉడికించిన కార్న్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇలా వేయించిన మిశ్రమంలో మైదా, కార్న్ ఫ్లోర్, జీలకర్ర, శెనగపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కారం కలిపి మిక్సీలో వేయాలి.
మరీ పొడిగా ఉండకుండా పాలు చేర్చి తిప్పాలి. ఇలా తయారైన ముద్దను చిన్న చిన్న ఉండలుగా చుట్టి నూనెలో వేయించుకోవాలి. ఈ కార్న్ ఫ్రిట్టర్స్‌ను సాస్‌తో తింటే బాగుంటుంది.
No comments:
Post a Comment