VTStyles

Recent Post

Monday, 18 July 2016

Starters - Veg - Veg Sheek Kabab / వెజ్‌ సీక్‌ కబాబ్‌

వెజ్‌ సీక్‌ కబాబ్‌


ఆలూ - మూడు పెద్దవి సోయా మీల్‌మేకర్‌ - ఒకటిన్నర కప్పు బఠాణీలు - అరకప్పు అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా ఉప్పు - తగినంత ధనియాలపొడి - చెంచా గరంమసాలా కారం మిరియాలపొడి - అరచెంచా చొప్పున ఆమ్‌చూర్‌ పొడి - పావుచెంచా వేయించిన సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు నూనె - పావుకప్పు.

  • ముందుగా నానబెట్టి బఠాణీలను ఉడికించుకోవాలి. అలాగే ఆలూను కూడా ఉడికించుకుని తీసుకోవాలి. సోయా మీల్‌మేకర్‌ని వేడినీటిలో వేయాలి. అవి మునిగాక నీటిని వంపేసి.. వాటిని పిండి విడిగా మరో గిన్నెలోకి తీసుకోవాలి.

  • ఈ మీల్‌మేకర్‌లో ఉడికించిన ఆలూ ముక్కలూ, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. తరవాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మరోసారి కలిపి చపాతీ పిండిలా చేసుకోవాలి. ఒకవేళ పిండి మరీ మెత్తగా ఉంటే... మరికొంచెం సెనగపిండి చేర్చుకోవచ్చు.

  • ఈ మిశ్రమాన్ని తొమ్మిది భాగాలుగా చేయాలి. ఒక్కోదాన్ని ఇనుప చువ్వలకు లేదా పొడవాటి చాప్‌స్టిక్స్‌కి గుచ్చుకోవాలి. తరవాత వీటికి నూనె రాయాలి.

  • ఇప్పుడు 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసిన ఓవెన్‌లో పదిహేను నిమిషాలు బేక్‌ చేసుకుని తీసుకోవాలి. లేదంటే గ్రిల్‌ పాన్‌ని పొయ్యిమీద పెట్టి.. ఒక చువ్వను ఉంచి.. తిప్పుతూ కాల్చుకుని తీసుకుంటే చాలు. వీటిని పుదీనా చట్నీతో కలిపి వడ్డించాలి.

No comments:

Post a Comment