బీట్‌రూట్ రోల్స్
బీట్ రూట్స్ - 2
ఫిల్లింగ్ కోసం
చిలికిన పెరుగు - 2 టేబుల్ స్పూన్లు క్రీమ్ చీజ్ - 2 టేబుల్ స్పూన్లు తరిగిన క్యాప్సికమ్ - 2 టేబుల్ స్పూన్లు తరిగి కొత్తిమీర - టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్ సాస్ కోసం: నూనె - టీ స్పూన్ రెడ్ క్యాప్సికమ్ - 2 గ్రీన్ క్యాప్సికమ్ - 2 వెల్లుల్లి -2 రెబ్బలు జీలకర్ర - 2 టీ స్పూన్ ఉప్పు - తగినంత నూనె - టేబుల్ స్పూన్ కొత్తిమీర - టీ స్పూన్ జీలకర్ర - అర టీ స్పూన్
పీలర్‌తో బీట్‌రూట్ పై తొక్క తీసి, ఉడకబెట్టి, చాలా పలచని స్లైసులుగా కట్ చేయాలి. ఫిల్లింగ్‌కి ఇచ్చినవన్నీ గిన్నెలో వేసి కలపాలి.పలచని బీట్‌రూట్ స్లైసులను రోల్ చేసి, పై మిక్చర్(ఫిల్లింగ్)ని ఫిల్ చేయాలి.
. సాస్ కోసం ఇచ్చిన పదార్థాలలో రెడ్ క్యాప్సికమ్, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా వేపి, చల్లారాక కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా రుబ్బి, పక్కనుంచాలి. అలాగే పచ్చ క్యాప్సికమ్, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర విడిగా వేయించి చల్లారాక కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా రుబ్బి, పక్కనుంచాలి.
ఫిల్ చేసిన బీట్‌రూట్ రోల్స్‌ని ప్లేట్‌లో పెట్టి ఒకవైపు ఎరుపు రంగు క్యాప్సికమ్ మిశ్రమం, మరోవైపు పచ్చరంగు క్యాప్సికమ్ మిశ్రమం పోయాలి. క్రీమ్ చీజ్.. ఆ పైన కొత్తిమీర లేదా తులసి ఆకును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment