కార్న్ కబాబ్
కార్న్ - 2 కప్పులు ఉడికించి తురిమిన ఆలూ - అర కప్పు చీజ్ తురుము - 2 టే.స్పూన్ పచ్చిమిర్చి - 2 అల్లం తరుగు - 2 టే.స్పూన్లు మిరియాల పొడి - అర టీస్పూను గరం మసాలా - అర టీస్పూను జాపత్రి పొడి - చిటికెడు పుదీనా ఆకులు - కొన్ని ఉప్పు నూనె - తగినంత.
మిక్సీలో కార్న్ వేసి పొడి చేసుకోవాలి. మిగతా దినుసులన్నింటినీ కార్న్‌పొడిలో కలపాలి.
ఈ పిండితో గారెలంత సైజుల్లో కబాబ్స్ చేసుకోవాలి. పెనం మీద నూనె వేసి వీటిని రెండు వైపులా కాల్చాలి. వేడి వేడిగా పుదీనా పచ్చడితో తినాలి.
No comments:
Post a Comment