VTStyles

Recent Post

Monday, 18 July 2016

Starters - Veg - Fala Fel / ఫలాఫెల్‌

ఫలాఫెల్‌


పెద్ద సెనగలు - రెండు కప్పులు నూనె - వేయించేందుకు సరిపడా ఉల్లిపాయ - ఒకటి (పెద్దది) జీలకర్ర - ఒకటిన్నర చెంచా వెల్లుల్లి రెబ్బలు - నాలుగు కొత్తిమీర తరుగు - పావుకప్పు ధనియాలపొడి - చెంచా మిరియాలపొడి కారం - పావు చెంచా చొప్పున ఉప్పు - తగినంత మైదా - ఒకటిన్నర టేబుల్‌ స్పూను.

  • సెనగల్ని కడిగి ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు వీటిని మిక్సీజారులోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి.

  • తరవాత అందులో నూనె, మైదా తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని నిమ్మకాయంత పరిమాణంలో ఉండల్లా చేసుకోవాలి.

  • ఒకదాన్ని మైదాలో దొర్లించి కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకుంటే చాలు. ఇలాగే మిగిలిన వాటినీ చేసుకోవాలి.

No comments:

Post a Comment