గార్లిక్ పనీర్
పనీర్ ముక్కలు - ఒకటింబావు కప్పు వెల్లుల్లి రెబ్బలు - ఆరు వెనిగర్ - చెంచా ఎండుమిర్చి - ఐదు చక్కెర - చెంచా ఉప్పు - తగినంత నూనె - టేబుల్‌స్పూను జీలకర్ర - అరచెంచా ఉల్లిపాయముక్కలు - అరకప్పు కొత్తమీర - ఓ కట్ట.
వెల్లుల్లి, ఎండుమిర్చీ, చక్కెరా, తగినంత ఉప్పూ, వెనిగర్ మిక్సీజారులోకి తీసుకుని నీళ్లు చల్లుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి జీలకర్ర వేయించాలి.
తరవాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక పనీర్ ముక్కలు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు వేయించాలి. తరవాత ముందుగా చేసుకున్న మిశ్రమం వేసి వేయించి, కొత్తిమీర చల్లి దింపేస్తే చాలు.
No comments:
Post a Comment