వెజ్ చీజ్ బాల్స్
తరిగిన క్యారెట్ ముక్కలు - 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు - 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు - 2 టీ స్పూన్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్ ఉడికించిన బంగాళాదుంప (చిదిమినది) - అర కప్పు కొత్తిమీర తురుము - 1 టేబుల్ స్పూన్ బ్రెడ్ ముక్కలు - 2 చీజ్ - 1 కప్పు మైదా పిండి - ముప్పావు కప్పు ఉప్పు - తగినంత నూనె - సరిపడా
బ్రెడ్ ముక్కలను పొడిగా చేసుకోవాలి. తర్వాత బౌల్‌లో క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, చిదిమిన బంగాళాదుంప, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పావు కప్పు మైదాపిండి, ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని, గారెల్లా ఒత్తుకోవాలి.
వాటి మధ్యలో కాస్తంత చీజ్ పెట్టి ముద్దలుగా చేయాలి. మరోవైపు మిగిలిన మైదాలో నీళ్లు పోసి లూజ్‌గా చేసుకోవాలి. ముద్దలుగా చేసుకున్న వాటిని ఆ పిండిలో ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి.
తర్వాత వాటిని 10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. వాటిని బయటికి తీశాక నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చీజ్ బాల్స్‌ను వేడివేడిగా టొమాటో సాస్‌తో సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment