
సొరకాయ తెప్లా
సొరకాయ తురుము - ఒక కప్పు గోధుమపిండి - ఒక కప్పు పచ్చిమిర్చి - ఒకటి ఉప్పు- తగినంత నూనె - ఒక టీ స్పూన కొత్తిమీర తురుము- ఒక టేబుల్ స్పూన కసూరీమేథీ - ఒక టేబుల్ స్పూన కారం - పావు టీ స్పూన పసుపు - చిటికెడు చాట్‌మసాలా - పావు టీ స్పూన నెయ్యి లేదా నూనె - రెండు టేబుల్ స్పూన్లు (తెప్లా పైన పూసేందుకు).
గోధుమపిండిలో సొరకాయ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కసూరీమేథీ, కారం, పసుపు, చాట్‌మసాలా, నూనె వేసి ముద్దలా కలపాలి.
సొరకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి పిండి కలిపేటప్పుడు ప్రత్యేకించి నీళ్ళు పోయనక్కర్లేదు. ఒకవేళ పిండి మరీ జారుగా అయితే మరికొంచెం గోధుమపిండి కలపండి. మెత్తటి ముద్ద తయారుచేసుకున్న తరువాత చిన్న చిన్న ఉండలు చేయాలి.
ఆ తరువాత రొట్టెల పెనాన్ని వేడిచేయాలి. అది వేడెక్కుతుండగానే గోధుమపిండిలో ఉండల్ని దొర్లించి రొట్టెల కర్రతో నాలుగైదు అంగుళాల వెడల్పులో గుండ్రంగా వత్తాలి. వీటిని వేడెక్కిన పెనం మీద వేసి కాల్చాలి.
పైన నూనె పూసి చివర్లను గరిటెతో నొక్కుతూ కాల్చాలి. ఇలానే రెండోవైపు కూడా చేయాలి. రెడీ అయిన తెప్లాలను మీకు నచ్చిన కూర లేదా పచ్చడితో తినొచ్చు.
No comments:
Post a Comment