VTStyles

Recent Post

Showing posts with label Curry - NonVeg - Mutton Kurma. Show all posts
Showing posts with label Curry - NonVeg - Mutton Kurma. Show all posts

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Mutton Kurma

మటన్‌ కుర్మా


నూనె- అరకప్పు ఉల్లిపాయ (తరిగి)- ఒకటి మటన్‌- ముప్పావు కేజీ పెరుగు- నాలుగు టీస్పూన్లు నీళ్లు- ఒక కప్పు ధనియాల పొడి- రెండు టీస్పూన్లు కారం- ఒక టీస్పూను ఉప్పు- తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు లవంగాలు- నాలుగు యాలకలు- రెండు దాల్చినచెక్క- మూడు అంగుళాలు వేగించిన ఉల్లిపాయ ముక్కలు- రెండు టీస్పూన్లు.

  • ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తరువాత మటన్‌, పెరుగు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి.

  • కొద్దిసేపటి తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు వేసి సన్నటి మంటపై అరగంట ఉడికించాలి. తరువాత వేగించుకున్న ఉల్లిపాయలు వేసి మటన్‌ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. దీన్ని చపాతీ, రోటీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.