మటన్ కుర్మా |
నూనె- అరకప్పు ఉల్లిపాయ (తరిగి)- ఒకటి మటన్- ముప్పావు కేజీ పెరుగు- నాలుగు టీస్పూన్లు నీళ్లు- ఒక కప్పు ధనియాల పొడి- రెండు టీస్పూన్లు కారం- ఒక టీస్పూను ఉప్పు- తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు లవంగాలు- నాలుగు యాలకలు- రెండు దాల్చినచెక్క- మూడు అంగుళాలు వేగించిన ఉల్లిపాయ ముక్కలు- రెండు టీస్పూన్లు.
ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తరువాత మటన్, పెరుగు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి.
కొద్దిసేపటి తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు వేసి సన్నటి మంటపై అరగంట ఉడికించాలి. తరువాత వేగించుకున్న ఉల్లిపాయలు వేసి మటన్ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. దీన్ని చపాతీ, రోటీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
No comments:
Post a Comment