VTStyles

Recent Post

Showing posts with label Curry - NonVeg - Mutton Mango Curry. Show all posts
Showing posts with label Curry - NonVeg - Mutton Mango Curry. Show all posts

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Mutton Mango Curry

మామిడి మాంసం


పచ్చి మామిడికాయలు- 2 ఉల్లిపాయలు-2 మటన్‌ ముక్కలు- 500 గ్రాములు నూనె- 4 టేబుల్‌ స్పూన్స్‌ లవంగాలు- 3 జీలకర్ర- 1 టేబుల్‌స్పూన్‌ దాల్చినచెక్క- 1 సోంపు- 1 టేబుల్‌ స్పూన్‌ కొత్తిమీర- పిడికిలికి వచ్చినంత మిరపపొడి- తగినంత ఉప్పు- తగినంత గరంమసాలా- 1 టేబుల్‌స్పూన్‌ ధనియాలపొడి- టేబుల్‌స్పూన్‌ జీలకర్రపొడి- 1 టేబుల్‌స్పూన్‌ పసుపు- అర టీస్పూన్‌ జింజర్‌ గార్లిక్‌ పేస్ట్‌- 1 టేబుల్‌స్పూన్‌.

  • మొదట మటన్‌ను శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడి, ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆన్‌ చేసి లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర, సోంపు, ధనియాలపొడి, గరంమసాలా, పసుపు, ఉప్పు ఇలా పైన చెప్పిన మసాలా దినుసులన్నింటిని దోరగా వేయించాలి.

  • ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బ్రౌన్‌రంగు వచ్చే వరకూ వేయించాలి. ఆ తర్వాత మటన్‌ వేసి బాగా ఐదు నిమిషాలు మిక్స్‌ చేయాలి. మిరపపొడి, ఉప్పు, తగినంత నీరు మటన్‌ కూరలో వేసి ఉడికించాలి.

  • మటన్‌ ఉడికిన వెంటనే మామిడి ముక్కల్ని, తరిగిన కొత్తిమీరను వేసి పదినిమిషాల పాటు ఉంచాలి. మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి. చివరగా తాజాగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని చల్లితే మ్యాంగో మాంసం రెడీ. దీన్ని అన్నంలో లేదా పలావ్‌తో కానీ తినాలి.