మామిడి మాంసం |
పచ్చి మామిడికాయలు- 2 ఉల్లిపాయలు-2 మటన్ ముక్కలు- 500 గ్రాములు నూనె- 4 టేబుల్ స్పూన్స్ లవంగాలు- 3 జీలకర్ర- 1 టేబుల్‌స్పూన్ దాల్చినచెక్క- 1 సోంపు- 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర- పిడికిలికి వచ్చినంత మిరపపొడి- తగినంత ఉప్పు- తగినంత గరంమసాలా- 1 టేబుల్‌స్పూన్ ధనియాలపొడి- టేబుల్‌స్పూన్ జీలకర్రపొడి- 1 టేబుల్‌స్పూన్ పసుపు- అర టీస్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్- 1 టేబుల్‌స్పూన్.
మొదట మటన్‌ను శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడి, ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర, సోంపు, ధనియాలపొడి, గరంమసాలా, పసుపు, ఉప్పు ఇలా పైన చెప్పిన మసాలా దినుసులన్నింటిని దోరగా వేయించాలి.
ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బ్రౌన్‌రంగు వచ్చే వరకూ వేయించాలి. ఆ తర్వాత మటన్ వేసి బాగా ఐదు నిమిషాలు మిక్స్ చేయాలి. మిరపపొడి, ఉప్పు, తగినంత నీరు మటన్ కూరలో వేసి ఉడికించాలి.
మటన్ ఉడికిన వెంటనే మామిడి ముక్కల్ని, తరిగిన కొత్తిమీరను వేసి పదినిమిషాల పాటు ఉంచాలి. మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి. చివరగా తాజాగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని చల్లితే మ్యాంగో మాంసం రెడీ. దీన్ని అన్నంలో లేదా పలావ్‌తో కానీ తినాలి.
No comments:
Post a Comment