![]() |
మరి కొన్ని ఐస్‌క్రీం రుచులు |
కావలసిన పదార్థాలు
* మామిడి గుజ్జు- 1 కప్పు
* పంచదార- 1/2 కప్పు
* ఫ్రెష్ క్రీం- అర కప్పు
* నీళ్ళు- 6 టేబుల్ స్పూన్లు
* అగార్ అగార్(చైనా గ్రాస్)పొడి- 4 టీ స్పూన్లు
* కొబ్బరి పాలు- 1/2 కప్పు.
తయారుచేయు విధానం
ముందుగా వేరు వేరు గిన్నెల్లో మూడు టేబుల్ స్పూన్ల చొప్పును నీళ్ళను తీసుకుని ఒక్కోదానిలో రెండు టీ స్పూన్ల చైనా గ్రాస్‌పొడి వేసి ఐదునిమిషాలు నానబెట్టాలి.
తరువాత కొబ్బరి పాలను సన్నని మంట మీద వేడిచేశాక దానిలో పావు కప్పు పంచదార వేసి కరిగే వరకూ కలపాలి. తరువాత పావు కప్పు ఫ్రెష్ క్రీం కూడా వేసి బాగా కలపాలి.
ఆ తరువాత ఒక గిన్నెలోని చైనాగ్రాస్ మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా బాగా కలిపి మిశ్రమం చిక్కబడ్డాక దించేయాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారగానే చిన్న గిన్నెల్లో గానీ, మౌల్డ్‌లలో గాని సగం వరకూ పోయాలి.
.ఆ తరువాత మరో పాత్ర తీసుకుని దానిలో పావు కప్పు ఫ్రెష్ క్రీం, పావుకప్పు పంచదార, మామిడి గుజ్జు వేసి ఐదునిమిషాలు ఉడికించాలి.
తరువాత మరో గిన్నెలో ఉన్న చైనాగ్రాస్ మిశ్రమాన్ని కూడా తీసుకుని దీనిలో వేయాలి. మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా చిక్కగా అయ్యే వరకూ ఉడికించి చల్లారాక కొబ్బరి మిశ్రమం సగం వరకూ నింపిన మౌల్డ్‌లలో మిగతా సగాన్ని మామిడి మిశ్రమంతో నింపి కనీసం రెండుగంటలు డీప్ ప్రీజర్‌లో ఉంచాలి.
No comments:
Post a Comment