![]() |
మరి కొన్ని పొడి రుచులు |
కావలసిన పదార్థాలు
*పుదీనా ఆకులు - 1 కప్పు
* శనగపప్పు - అరకప్పు
* మినప్పప్పు - పావు కప్పు
* ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు
* ఎండుమిర్చి - 8
* ఉప్పు - రుచికి తగినంత
* బెల్లం తురుము - 1 టీ స్పూను
* చింతపండు - 1 రెబ్బ.
తయారుచేయు విధానం
పుదీనా ఆకులు, శనగపప్పు, మినప్పప్పులను విడివిడిగా దోరగా వేగించి పక్కనుంచాలి. ఎండుకొబ్బరి తురుమును 1 నిమిషం వేగించి తీసెయ్యాలి.
ఒక స్పూను నూనెలో ఎండుమిర్చి మాడకుండా వేగించాలి. అన్ని పదార్థాలు చల్లారిన తర్వాత ముందుగా పప్పులు బరకగా పొడిచేసుకోవాలి.
తర్వాత ఎండుమిర్చి, పుదీనా, ఎండుకొబ్బరి, చింతపండు పొడి చేసి, అన్నీ కలిపి తగినంత ఉప్పు, బెల్లంతో మరోసారి తిప్పాలి. ఈ పొడి వేడి వేడి అన్నంతో బాగుంటుంది.
No comments:
Post a Comment