![]() బనానా డాగ్ బైట్స్ |
మరి కొన్ని రోల్స్ రుచులు |
కావలసిన పదార్థాలు
*అరటిపండు - 2
* పీనట్ బటర్ - పావుకప్పు
* చపాతీలు - 2
* తేనె - 1 టీ స్పూన్
తయారుచేయు విధానం
ముందుగా అరటిపండ్ల తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీలకు ముందుగా తేనెను సమానంగా రాయాలి. ఆపైన పీనట్ బటర్‌ను అప్లై చేయాలి.
ఇప్పుడు ఒక్కో చపాతీలో ఒక్కో అరటిపండును పెట్టి రోల్ చేయాలి. తర్వాత ఒకటిన్నర ఇంచు చొప్పున రోల్‌ను కట్ చేసుకోవాలి.
కావాలంటే చపాతీలకు బదులు టార్టిల్లాలను వాడొచ్చు. ఇవి షాపుల్లో దొరుకుతాయి. అలాగే పీనట్ బటర్‌ను కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే.. ముందుగా పల్లీలను వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి. ఆపైన అందులో చిటికెడు ఉప్పు, తేనె, కొద్దిగా పల్లి నూనె వేసి మరోసారి క్రీమ్‌లా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి
No comments:
Post a Comment