VTStyles

Recent Post

Monday, 27 June 2016

Continental - Rolls - Bread Rolls / బ్రెడ్‌ రోల్‌

బ్రెడ్‌ రోల్‌


బ్రెడ్‌ - ఒక ప్యాకెట్‌ నూనె - అరకేజి బంగాళాదుంపలు - అరకేజి బఠానీ - ఒక కప్పు క్యారెట్‌ కాలీఫ్లవర్‌ బీన్స - 3 కప్పులు (సన్నగా కోయాలి) ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు క్యాప్సికమ్‌ ముక్కలు - అర కప్పు అల్లం మిర్చి పేస్ట్‌ - 3 స్పూన్లు కారం - 2 స్పూన్లు గరం మసాలా - ఒక స్పూన ఉప్పు పసుపు - సరిపడా నిమ్మకాయలు - 2 కొత్తిమీర - కొద్దిగా..

  • మూకుడులో నూనె పోసి వేడెక్కాక దానిలో అల్లం, మిర్చి పేస్ట్‌, ఉల్లి, క్యాప్సికం ముక్కలు వేసి బాగా వేగించాలి. ఉడికించిన కూరగాయలను వేసి నీరు ఇగిరేవరకు వేగించాలి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి.

  • ఆ తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి పొయ్యి మీద నుంచి దించేయాలి.

  • బ్రెడ్‌ ముక్కల అంచులను కట్‌ చేసి ఒక్కొక్క దానిని నీటిలో ముంచి తీసి అర చేతులతో ఒత్తి నీరు పిండి ముక్కలో ఒక స్పూన కూరను పెట్టి చుట్టూ మూసి ముద్దలా చుట్టాలి.

  • ఈవిధంగా అన్ని రోల్స్‌ తయారుచేసి ప్లేటులో ఉంచి ఫ్రిజ్‌లో 2 గంటలు ఉంచి తీసి బాండీలో నూనె పోసి కాగిన తర్వాత కొన్ని రోల్స్‌ చప్పున వేసి గోల్డ్‌ కలర్‌ వచ్చేవరకు వేగించాలి. బ్రెడ్‌ రోల్స్‌ రెడీ టూ ఈట్‌.

No comments:

Post a Comment