VTStyles

Recent Post

Monday, 27 June 2016

Continental - Rolls - VegPaneerRolls / వెజ్ పనీర్ రోల్స్

వెజ్ పనీర్ రోల్స్


క్యాప్సికమ్ ముక్కలు - అరకప్పు తరిగిన టొమాటోలు - అరకప్పు పసుపు - 1 టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ - 1 టేబుల్ స్పూన్ (కావాలనుకుంటేనే) పనీర్ ముక్కలు - 1 కప్పు ఉప్పు - సరిపడా కారం పొడి - 1 టీ స్పూన్ మసాలా పొడి - 1 టీ స్పూన్ తరిగిన కొత్తిమీర - అరకప్పు పెరుగు - పావుకప్పు నూనె - 2 టీ స్పూన్లు తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు చపాతీలు - 4

  • స్టౌపై ప్యాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, పనీర్ ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత దాంట్లో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసి బాగా కలపాలి.

  • అందులో టొమాటో సాస్ వేసి రెండు నిమిషాలు స్టౌను పెద్ద మంటపై ఉంచి, తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలను తీసుకొని.. వాటికి పెరుగు రాసి పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో పెట్టి, కొత్తిమీరను చల్లాలి. తర్వాత వాటిని రోల్ చేయాలి.

  • అలాగైనా లేదా ఆ రోల్‌ను ముక్కలుగా చేసైనా పిల్లలకు సర్వ్ చేసుకోవచ్చు. వీటిని కొత్తిమీర చట్నీ, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే టేస్ట్ అదుర్స్.

No comments:

Post a Comment