VTStyles

Recent Post

Monday, 27 June 2016

Continental - Rolls - Cafreal Chicken Roll / కాఫరియల్‌ చికెన్‌

కాఫరియల్‌ చికెన్‌


కొత్తిమీర - రెండు కట్టలు దాల్చిన చెక్క - పెద్ద ముక్క పచ్చిమిర్చి - ఐదారు అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర చెంచా జీలకర్ర - చెంచా యాలకులు - నాలుగు వెనిగర్‌ - చెంచా ఉప్పు - తగినంత నూనె - రెండు టేబుల్‌స్పూన్లు ఎముకల్లేని చికెన్‌ ముక్క - ఒకటి పెద్దది.

సలాడ్‌ కోసం

క్యాబేజీ ఆకులు - నాలుగు మయొనైజ్‌ - రెండు చెంచాలు(బజార్లో దొరుకుతుంది) ఉల్లిపాయ - ఒకటి పెద్దది (ముద్దలా చేసుకోవాలి) ఆవాల ముద్ద - చెంచా వెల్లుల్లి ముద్ద - చెంచా చీజ్‌ - రెండు చెంచాలు నిమ్మరసం - చెంచా టొమాటో సాస్‌ - కొద్దిగా ఉప్పూ మిరియాలపొడి - రుచికి సరిపడా.

టార్టిల్లాల కోసం

మైదా - నాలుగు కప్పులు ఆలివ్‌నూనె - కొద్దిగా ఉప్పు - చెంచా బేకింగ్‌ పౌడర్‌ - రెండు చెంచాలు.

మైదా - నాలుగు కప్పులు ఆలివ్‌నూనె - కొద్దిగా ఉప్పు - చెంచా బేకింగ్‌ పౌడర్‌ - రెండు చెంచాలు.

  • ముందుగా టార్టిల్లాలు తయారుచేసుకోవాలి. నీళ్లు తప్ప అందుకోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరవాత నీళ్లు పోసుకుంటూ చపాతీపిండిలా చేసుకోవాలి. ఓ పదినిమిషాలు నాననిచ్చి... తరవాత పల్చని చపాతీల్లా వత్తుకుని పెనంపై వేసి రెండువైపులా కాల్చుకోవాలి.

  • ఇప్పుడు చికెన్‌ తయారు చేసుకోవాలి. చికెన్‌ నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. ఈ ముద్దను చికెన్‌కి పట్టించి.. ఓ అరగంట నాననివ్వాలి. తరవాత దీన్ని ఓవెన్‌లో గ్రిల్‌ చేసుకోవాలి.. లేదంటే సన్నని మంటపై గ్రిల్‌పాన్‌ని ఉంచి.. రెండువైపులా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. దీన్ని విడిగా పెట్టుకోవాలి.

  • చివరగా సలాడ్‌ చేసుకోవాలి. క్యాబేజీ ఆకులు తప్ప మిగిలిన పదార్థాలను ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఓ చపాతీని తీసుకుని దానిపై క్యాబేజీ ఆకును పరవాలి. అందులో సలాడ్‌, కొద్దిగా చికెన్‌ ఉంచి.. వెడల్పుగా ర్యాప్‌లా చుట్టి, దీన్ని పెనంపై ఉంచి.. రెండువైపులా కరకరలాడేలా కాల్చాలి. లేదంటే గ్రిల్‌ పద్ధతిలో కాల్చుకున్నా సరిపోతుంది.

No comments:

Post a Comment