![]() బెల్లం గవ్వలు |
మరి కొన్ని కాజా రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* మైదా - అరకిలో
* నెయ్యి - 25 గ్రా.
* బెల్లం - పావు కిలో
* యాలకుల పొడి - చిటికెడు
* ఉప్పు - తగినంత
* నూనె - సరిపడా
తయారుచేయు విధానం
మైదాలో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. వీటిని గవ్వల్లాగా చేసుకుని, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
బెల్లంలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. లేత పాకం అయ్యాక యాలకుల పొడి చల్లి తీసేయాలి. ఈ పాకాన్ని వేయించి పెట్టుకున్న గవ్వల మీద పోయాలి.
(పాకం ఇష్టం లేనివాళ్లు చక్కెరను పొడి చేసి, మైదా పిండిలో వేసి కలిపేసుకోవచ్చు.)
No comments:
Post a Comment