![]() సెనగపప్పు |
మరి కొన్ని కాజా రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*సెనగపప్పు - కప్పు
* బియ్యప్పిండి - పావుకప్పు
* పచ్చికొబ్బరితురుము - పావుకప్పు
* బెల్లంతురుము - కప్పు
* యాలకుల పొడి - చెంచా
* నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేయు విధానం
సెనగపప్పును ఉడకబెట్టి పూర్ణాలకు చేసుకున్నట్లుగా ముద్దలా చేసుకోవాలి. అందులో బియ్యప్పిండీ, పచ్చికొబ్బరితురుమూ కలుపుకోవాలి. దీన్ని కాస్త మందంగా చపాతీలా వత్తుకుని అర్ధచంద్రాకారంలో కోసుకోవాలి.
ఇలా చేసుకున్న వాటన్నింటినీ వేడినూనెలో వేసుకుని బాగా వేగాక తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం తురుమును మునిగేదాకా నీళ్లు పోసుకుని తీగపాకం పట్టాలి.
అందులో యాలకులపొడి వేసుకుని ముందుగా వేయించుకున్న నెలవంకల్ని వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరవాత ఇవతలకు తీసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment