మలై కాజా |
మైదా: అరకిలో పంచదార: కిలో నెయ్యి: 60 గ్రా. కోవా: 200 గ్రా. పిస్తా: 25 గ్రా. నూనె: వేయించడానికి సరిపడా
మైదాపిండిలో నెయ్యి వేసి బాగా కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి పిండిముద్దలా కలిపి పదినిమిషాలపాటు తడిబట్ట కప్పి ఉంచాలి.
పంచదారలో రెండు గ్లాసుల నీళ్లు పోసి లేతపాకం రానిచ్చి దించాలి. కాస్త చల్లారాక కోవా ముద్దను వేసి కలిపి ఉంచాలి.
ఇప్పుడు పిండి ముద్దను ఓ పెద్ద రాయి లేదా బల్లమీద పెద్ద చపాతీలా చేయాలి. దానిమీద కాస్త పిండి చల్లి, చేత్తోనే మొత్తంగా పరచుకునేలా చేయాలి. తరవాత ఓ వైపు నుంచి చాపలా చుట్టాలి.
తడితో అంచుల్ని మూసినట్లుగా వత్తాలి. దీనిమీద కర్రతో ఓసారి నొక్కినట్లుగా వత్తి ముక్కలుగా కోసి కాగిన నూనెలో సన్ననిమంటమీద దోరగా వేయించి తీసి మలై పాకంలో ఓ రెండు నిమిషాలు ముంచి తీసి, పిస్తాపొడి చల్లాలి.
No comments:
Post a Comment