బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ |
లీటరు పాలు 12 స్లయిసెస్ బ్రెడ్డు ఒకటిన్నర స్పూను వెన్న ఐదు స్పూన్ల చక్కెర అరకప్పు ఎండుద్రాక్ష రెండు ఆపిల్స్ (తొక్కు గింజలు తీసి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి) రెండు స్పూన్ల చక్కెర పాకం అరకప్పు కర్జూరం ముక్కలు రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడరు. పైన అలంకరించడానికి కొన్ని పండ్ల ముక్కలు.
బ్రెడ్ ముక్కల్ని ఆ చివర ఈ చివర తీసేసి వెన్న రాయండి. ఒక్కొక్క దాన్ని నాలుగు ముక్కలు చేసి పెట్టుకోండి.
తీసేసిన బ్రెడ్ చివరల్ని మిక్సీలో వేసి పొడి కొట్టండి. ఎండుద్రాక్ష, ఆపిల్, కర్జూరం ముక్కల్ని చక్కెర పాకంలో వేసి ఒక అరగంట నానబెట్టండి.
పాలు వేడిచేసి గోరువెచ్చగా ఉండగానే ఒక అరకప్పు పక్కన పెట్టి కస్టర్డ్ పౌడరు కలపండి. మిగతా పాలని చిక్కబడేదాకా ఉంచి దించి చక్కెర కలిపి కాస్త చల్లబడ్డాక కస్టర్డ్ పౌడరు, బ్రెడ్ ముక్కల పొడి కలపాలి.
కేక్ గిన్నెకు నెయ్యి రాసి అడుగున వెన్న రాసిన బ్రెడ్ ముక్కలు వేసి దానిపైన పాకంలో నానబెట్టిన పండ్ల ముక్కలు, పాలు పోసి ఐదు నిమిషాల తర్వాత కుక్కర్‌లో పెట్టి ఆవిరి మీద ఉడకనివ్వాలి.
40-45 నిమిషాలు పట్టొచ్చు. దించాక మరికొన్ని పండ్ల ముక్కలు వేసి పెట్టండి.
No comments:
Post a Comment