VTStyles

Recent Post

Friday, 1 July 2016

Bakery - Pudding - Choco Duet / చాకో డ్యూయట్‌

చాకో డ్యూయట్‌


పాలు - అరలీటరు జెలాటిన్‌ - 50 గ్రా (ఇది బజార్లో దొరుకుతుంది) చక్కెర - 100 గ్రా చాక్లెట్‌ - 100 గ్రా స్ట్రాబెర్రీ గుజ్జు - కొద్దిగా గిలక్కొట్టిన క్రీం - 400 గ్రా సాధారణ వెనిల్లా స్పాంజి కేకు - ఒకటి పెద్దది (ఇది బజార్లో దొరుకుతుంది).

  • ఓ గిన్నెలో పాలు, చక్కెర, జెలాటిన్‌ని తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి చిక్కని సాస్‌లా తయారవుతుంది.

  • ఇందులో గిలక్కొట్టిన క్రీం వేయాలి. అంతా కలిశాక దింపేసి రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక దాంట్లో చాక్లెట్‌, మరోదాంట్లో స్ట్రాబెర్రీ గుజ్జూ కలపాలి.

  • పొడవాటి పళ్లెం తీసుకుని వెనిల్లా స్పాంజి కేక్‌ని ఉంచాలి. దానిపైన చాక్లెట్‌ మిశ్రమాన్ని పరిచి డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • అది గట్టిపడ్డాక స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని పరిచి మళ్లీ డీప్‌ఫ్రిజర్‌లో ఉంచాలి. కాసేపటికి ఇది కూడా గట్టిపడుతుంది.

  • ఆ తరవాత బయటకు తీసి నచ్చిన ఆకృతిలో ముక్కల్లా కోస్తే, నోరూరించే చాకో డ్యూయెట్‌ని తినడమే ఆలస్యం.

No comments:

Post a Comment