తీపి బజ్జీలు |
మైదాపిండి - పావుకిలో చక్కెరపొడి - పావుకిలో పెరుగు - రెండు కప్పులు ఉప్పు - సరిపడా పచ్చిమిర్చి - ఆరు పెద్ద ఉల్లిపాయలు - రెండు జీలకర్ర - ఒక టీ స్పూన అల్లం - చిన్న ముక్క కరివేపాకు - రెండు రెమ్మలు నూనె - పావు కేజీ.
మైదాపిండిని జల్లించుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం అన్నింటినీ సన్నగా తరిగి ఉంచుకోవాలి. మైదాపిండితో పాటు తరిగి ఉంచుకున్న ముక్కలు, పెరుగు, ఉప్పు, జీలకర్ర, చక్కెర పొడి వేసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి.
ఈ పిండిని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరువాత పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. నూనె కాగుతుండగా చిన్న చిన్న బోండాల లాగా వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీయాలి.
అంతే మైదాతో తయారైన తీపి బజ్జీలు సిద్ధమైనట్లే! తీపి వద్దనుకునేవాళ్ళు చక్కెరపొడి తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేసి బజ్జీలు చేసుకోవచ్చు.
No comments:
Post a Comment