VTStyles

Recent Post

Friday, 1 July 2016

Bakery - Pudding - Irish Cream Cheese Cake / ఐరిష్‌ క్రీం చీజ్‌ కేక్‌

ఐరిష్‌ క్రీం చీజ్‌ కేక్‌


గుడ్లు - ఐదు (పచ్చసొన మాత్రమే తీసుకోవాలి) కాస్టర్‌ షుగర్‌ - 80 గ్రా జెలాటిన్‌ - 20 గ్రా క్రీంచీజ్‌ - 130 గ్రా పాలు - అరలీటరు గిలక్కొట్టిన క్రీం - 150 గ్రా ఐరిష్‌ కాఫీ లిక్కర్‌ - 90 ఎంఎల్‌ (ఇది సూపర్‌ మార్కెట్లలో సీసాల్లో దొరుకుతుంది).

బేక్‌ కోసం కావల్సినవి

బిస్కెట్లు - పది కరిగించిన వెన్న - 150 గ్రా.

సాస్‌ కోసం

క్రీం - రెండుకప్పులు బ్లాక్‌ కాఫీ డికాక్షన్‌ - 150 ఎంఎల్‌ ఐరిష్‌ కాఫీ లిక్కర్‌ - 120 ఎంఎల్‌.

  • ముందుగా సాస్‌ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ కలిపి పెట్టుకోవాలి.

  • మరో గిన్నెలో గుడ్డులోని పచ్చసొన, కాస్టర్‌ షుగర్‌ తీసుకుని బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమం మెత్తని క్రీంలా తయారయ్యాక క్రీంచీజ్‌, పాలు, గిలక్కొట్టిన క్రీం, కాఫీ లిక్కర్‌.. ఇలా ఒక్కోటి వేస్తూ కలపాలి.

  • ఇప్పుడు జెలాటిన్‌ని ఓ గిన్నెలోకి తీసుకుని రెండుమూడు చెంచాల వేడినీళ్లను పోసి కలిపితే మిశ్రమంలా తయారవుతుంది. దీన్ని కూడా కోడిగుడ్డు మిశ్రమానికి కలపాలి.

  • వెడల్పాటి పళ్లెంలో ముందుగా బిస్కెట్లు పరిచి, పైన కరిగిన వెన్న వేసి దానిపైన ఈ మిశ్రమాన్ని మందంగా పరవాలి. డీప్‌ఫ్రీజర్‌లో అరగంట ఉంచి తరవాత బయటకు తీస్తే గట్టిపడుతుంది.

  • పైన సాస్‌ వేస్తే సరిపోతుంది. నోరూరించే క్రీం, చీజ్‌ కేక్‌ సిద్ధం. దీన్ని బేక్‌ చేయాల్సిన అవసరం లేదు.

No comments:

Post a Comment