![]() అరటికాయ బజ్జీలు |
మరి కొన్ని బజ్జీలు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పచ్చి అరటికాయలు - 2 లేదా 3 (పొట్టు తీసి పలుచగా కావల్సిన ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి)
* శనగపిండి - రెండు కప్పులు
* బియ్యప్పిండి - కప్పు
* కారం - స్పూన
* బేకింగ్ సోడా - చిటికెడు
* వాము - అర స్పూన
* ఉప్పు - రుచికి సరిపడా
* నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, వాము, బేకింగ్ సోడా, సరిపడా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలిపి పెట్టుకోవాలి.
తర్వాత ఒక పానను స్టవ్ మీద పెట్టి, అందులో నూనె పోసి, వేడిచేయాలి.
వేడయ్యాక ఇప్పుడు ముందుగా చక్రాల్లా కట్ చేసి పెట్టుకున్న పచ్చి అరటికాయ ముక్కల్ని శనగపిండి మిశ్రమంలో ముంచి, కాగుతున్న నూనెలో వేయాలి. వీటిని బంగారువర్ణం వచ్చేవరకూ వేయించుకోవాలి.
బజ్జీల్ని టిష్యూ పేపర్లోకి తీసుకుని, ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్‌లో పెట్టాలి. వీటికి టమాటా సాస్ మంచి కాంబినేషన్.
No comments:
Post a Comment