కీమా పట్టి సమోసా |
ఎముకల్లేని మటన్ కీమా - మూడు కప్పులు (దాదాపు 600 గ్రా) అల్లంవెల్లుల్లి పేస్టు - టేబుల్‌స్పూను చొప్పున ఉల్లిపాయలు పెద్దవి - నాలుగు కారం - ఒకటిన్నర టేబుల్‌స్పూను గరంమసాలా - టేబుల్‌స్పూను పసుపు - చెంచా నిమ్మకాయలు - రెండు కొత్తిమీర - కట్ట నూనె - వేయించేందుకు సరిపడా ఉప్పు - తగినంత మైదా - ఒకటిన్నర కప్పు.
మైదాలో కొద్దిగా ఉప్పూ వేసి, నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి ఇది ఇరవై నిమిషాలు నాననివ్వాలి.
ఇంతలో కూర తయారుచేసుకోవాలి. పొయ్యివెలిగించి దానిపై బాణలి పెట్టాలి. అందులో కొద్దిగా నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి ఎర్రగా వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి.
కొన్ని నిమిషాల తరవాత కారం, పసుపూ, తగినంత ఉప్పూ వేయాలి. అన్నీ కలిశాక మటన్ కీమాను వేసి మంట తగ్గించేయాలి. కాసేపటికి కీమా మెత్తగా అవుతుంది. అప్పుడు గరంమసాలా, కొత్తిమీర తరుగూ, నిమ్మరసం వేసి బాగా కలిపితే, కూర సిద్ధమైనట్లే.
ముందుగా కలిపి పెట్టుకున్న మైదాను చిన్న చపాతీలా వత్తి..మధ్యకు కోసి త్రికోణాకృతిలో చేసుకోవాలి. అందులో ముందుగా చేసుకున్న కీమాను ఉంచి, అంచులు మూసేయాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకోవాలి.
ఇప్పుడు రెండు సమోసాల చొప్పున కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకుంటే చాలు.
No comments:
Post a Comment