వెజ్ రంగూన్స్ |
గోధుమ లేక మైదాపిండి - 2 కప్పలు పచ్చి బఠాణీ - పావకప్ప బంగాళాదుంప - 1 క్యారెట్ తురము - పావకప్ప పచ్చిమిర్చి - 2 ఆల్లం తురము - 1 చెంచా వెల్లుల్లి తరుము - 1 చెంచా తురిమిన చీజ్ - పావకప్ప ఉప్పు - చిటికెడు కారం - 1 చెంచా నూనె - వేయించడానికి సరిపడా
గోధుమ మైదాపిండిలో కొద్దిగా నీళ్లు, ఉప్పు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టాలి. బంగాళాదుంపను ఉడికించి, తొక్క ఒలిచి, మెత్తగా చిదమాలి.
పచ్చి బఠాణీని కూడా ఉడికించి పెట్టాలి. వచ్చిమిర్చిని సన్నగా తరగాలి. స్లామీద కడాయి పెట్టి కొద్దిగా నూనె వేయాలి. ఆపైన పచ్చి బఠాణీ, క్యారెట్ తరుము, పచ్చిమిర్చి, ఆల్లం, వెల్లుల్లి వేయాలి.
దోరగా వేగాక ఉప్పు, కారం వేసి మరి కాసేప వేయించి దించేయాలి. తర్వాత గోధుమ మైదాపిండితో చపాతీలు చేసుకుని. చాకుతో చతురస్రాకారంలో చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
వాటి మధ్యలో వేయించిన వెజ్ మిశ్రమం పెట్టి, కొద్దిగా చీజ్ వేయాలి. తర్వాత నాలుగు పక్కల నుంచీ చపాతీ ముక్కని వేళ్లతో పట్టుకుని మధ్యకి ముడవాలి (ఫోటోలో ఆకారం వచ్చేలా). ఆపైన వీటిని నూనెలో డీప్ ఫ్రె పేనుకోవాలి.
No comments:
Post a Comment