రైస్, కోకోనట్ బర్ఫీ |
కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు గుడ్లు - నాలుగు బియ్యప్పిండి - మూడుకప్పులు చిక్కని పాలు - మూడుకప్పులు చక్కెర - రెండున్నర కప్పులు ఉప్పు కలపని వెన్న - మూడు టేబుల్‌స్పూన్లు కొబ్బరిపాలు - చెంచా ఉప్పు - పావుచెంచా.
ఓవెన్‌ని ముందుగానే 350 డిగ్రీల ఫారన్‌హీట్‌లో వేడిచేసుకోవాలి. వెడల్పాటి బేకింగ్ పాత్రకి కొద్దిగా వెన్న రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరితురుమును బేకింగ్‌పాత్రలో మందంగా పరిచి ఐదునిమిషాలు బేక్‌చేసుకుని తీసుకోవాలి.
ఓ గిన్నెలో గుడ్ల సొన తీసుకుని కొద్దిగా గిలకొట్టి మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ, కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌పాన్‌లో తీసుకుని పైన కొబ్బరి తురుము వేసుకుని, పావుగంట బేక్ చేసుకోవాలి.
బర్ఫీ కొద్దిగా చల్లారాక విడిగా తీసుకుని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి ముక్కల్లా కోసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment