
ఓట్స్ రవ్వ ఊతప్పం
మరి కొన్ని దోసె రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*ఓట్స్ - అర కప్పు
* బొంబాయి రవ్వ - అర కప్పు
* పెరుగు - 1 కప్పు
* జీలకర్ర - అర టీస్పూను
* నూనె - సరిపడా
* ఉల్లిపాయ - 1
* పచ్చిమిర్చి - 1
* క్యారెట్ తురుము - 3 టే.స్పూన్లు
* క్యాబేజి తురుము - 3 టే.స్పూన్లు
* కొత్తిమీర - 1 కట్ట
* ఉప్పు - తగినంత
తయారుచేయు విధానం
ఓట్స్, రవ్వ, పెరుగు, జీలకర్ర, ఉప్పు ఓ గిన్నెలో వేసి కలుపుకుని అరగంటపాటు పక్కనుంచుకోవాలి.
దీనికి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజి, కొత్తిమీర, నీరు చేర్చి బాగా కలపాలి.
నాన్ స్టిక్ తవా వేడిచేసి గరిటెతో పిండి పోసి ఊతప్పం వేయాలి. చిన్న మంట మీద ఉంచి నూనె పోసి ఊతప్పం కాల్చుకోవాలి.
No comments:
Post a Comment