![]() |
మరి కొన్ని దోసె రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* మష్రూమ్స్ (చిన్న ముక్కలు తరిగి)- 200 గ్రాములు
* బియ్యం
* మినపప్పు
* పచ్చిమిర్చి
* ఉల్లిపాయలు
* కొత్తిమీర
* అల్లంవెల్లుల్లి పేస్టు
* నూనె
* ఉప్పు
* జీలకర్ర
* అన్నం.
తయారుచేయు విధానం
:ముందు రోజు రాత్రే బియ్యం, మినపప్పులు నీళ్లలో నానబెట్టుకుని దోసెపిండిని తయారుచేసుకున్నట్లు చేసుకోవాలి.పిండిని రుబ్బే ముందు అందులోకి కొంచెం అన్నం కూడా వేస్తే పిండి ఊరుతుంది.
.ఉదయాన్నే ఊతప్పం వేసుకునే ముందు.. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చిలు సన్నగా తరగాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఉప్పులతో పాటు తరిగిన వాటిని పిండిలోకి వేసుకుని బాగా కలపాలి. పిండి మరీ జారుగా చేసుకోవద్దు.
పాన్‌లో రెండుస్పూన్ల నూనె వేసి చిన్నముక్కలుగా కోసిప మష్రూమ్స్‌ను దోరగా వేగించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి మగ్గబెట్టాలి.
చల్లారిన తరువాత ముందు తయారుచేసుకున్న మిశ్రమంలో వేసి కలియబెట్టాలి. బాగా వేడెక్కిన దోసెపెనం మీద మందంగా ఊతప్పం వేసి, చుట్టూ నూనె వేయాలి. ఉల్లిముక్కలు, కొత్తిమీర పైన చల్లి తింటే రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment